Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లి చూశా... ఆయన భార్య పనులు చేయిస్తుంటే చూశా: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy about Janwada farm house
Advertisement
  • పొంగులేటికి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణం ఉన్న విషయం తెలియదన్న మంత్రి
  • పొంగులేటి హైదరాబాద్‌లో ఉంటున్నారు... అక్కడే ఇల్లు ఉందని వ్యాఖ్య
  • తెలంగాణ కోసం తాము రోడ్డెక్కి ఉద్యమించామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Advertisement
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయనే విషయం తనకు తెలియదని, ఎందుకంటే ఆయన ఉండేది హైదరాబాద్‌లో... ఆయనకు ఇక్కడే ఇల్లు ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎఫ్‌టీఎల్‌లో పొంగులేటికి నిర్మాణం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి తీవ్రంగా స్పందించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్‌దే అన్నారు. మీడియా వస్తే తాను తీసుకెళ్లి చూపిస్తానన్నారు.

తాను కేటీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లానని... అక్కడ ఆయన భార్య పనులు చేయిస్తోందన్నారు. జన్వాడలో ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ లేదని చురక అంటించారు. ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ల ఇళ్లు, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్‌లు... ఇలా అందరివీ తొలగిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పాటు కోసం కేటీఆర్ ఒక్క లాఠీ దెబ్బ తిన్నారా? అని నిలదీశారు. తాము తెలంగాణ కోసం ఉద్యమించామని... కానీ కేసీఆర్‌లా ఆసుపత్రిలో ఉద్యమం చేయలేదన్నారు. తాము రోడ్డెక్కి ఉద్యమించామన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ అనడం ఏమిటని మండిపడ్డారు. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే మరుక్షణమే బీఆర్ఎస్ కార్యాలయాలు, ఫామ్ హౌస్‌లు పునాదులతో సహా గాల్లో కలుస్తాయని హెచ్చరించారు.

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోనే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓట్లు భారీగా తగ్గాయని, అలాంటిది తాము అధికారంలోకి వస్తామని కేటీఆర్ అంటే నవ్వొస్తుందన్నారు. కేటీఆర్‌ను ఇక నుంచి బీజేపీ నేత కేటీఆర్ అనాలని ఎద్దేవా చేశారు. కుటుంబం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు.
Advertisement
Advertisement
Komatireddy Venkat Reddy
Congress
KTR
Revanth Reddy

More Telugu News